రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా నగరం మండలంలో జరిగింది. ఉయ్యూరు వారి పాలెం గ్రామానికి చెందిన సిద్దార్థ (19)అనే యువకుడు పొలంలో కూలీ పని చేసేందుకు తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. చిలకవారిపాలేం గ్రామ శివారులో బైక్ను వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సిద్ధార్థ.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నగరం మండలం ఉయ్యూరువారి పాలెంలో జరిగింది.
వాహనం ఢీకొని యువకుడు మృతి