ఈతకు వెళ్లిన ఓ యువకుడు మరణించిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. పట్టణంలోని 19వ వార్డుకు చెందిన మామిడి భద్రి అనే యువకుడు.. అమరావతి మేజర్ కాలువలో ఈతకు వెళ్లి గల్లంతైనట్లు అతడి బంధువులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇవ్వగా.. గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికి తీసినట్లు వెల్లడించారు.
అమరావతి మేజర్ కాలువలో ఈతకు వెళ్లి యువకుడు మృతి - అమరావతి మేజర్ కాలువలో సత్తెనపల్లి యువకుడు మృతి
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన మామిడి భద్రి.. ఈతకు వెళ్లి మరణించాడు. అమరావతి మేజర్ కాలువలో గల్లంతు కాగా.. అగ్నిమాపక సిబ్బంది గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు.
సత్తెనపల్లిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి