సరదాగా ఈత కొట్టేందుకు కాలువలో దిగి యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. సత్తెనపల్లికి చెందిన షేక్ మహబూబ్ కరీం వడ్రంగి పని చేస్తుంటాడు. శుక్రవారం కొర్రపాడు, జంగంగుంట్ల గ్రామాల్లో పని చేసేందుకు వెళ్లాడు.
ఈత సరదా... ప్రాణాలు తీసింది - sathenapally news
సరదాగా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగి ఓ యువకుడు ప్రాణాలు కొల్పోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![ఈత సరదా... ప్రాణాలు తీసింది young-man-went-swimming-and-died-in-guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10172732-902-10172732-1610135143300.jpg)
సరదాగా ఈతకు వెళ్లి యువకుడు మృతి
కొంత సమయం తరువాత భీమినివారిపాలెం సమీపంలోని ఓ కాలువలో ఈతకు దిగి నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మేడికొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని భార్య, ఓ కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి