సరదా కోసం ఈతకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిగుంట్ల కిరణ్(22) తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని బావిలో ఈత కొట్టేందు వెళ్లాడు. అయితే ఈత కొడుతుండగా కిరణ్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు.. బావిలో నుంచి బయటకు వచ్చి స్థానికులకు తెలపడంతో వారు సత్తెనపల్లి ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకోని బావిలో గాలింపు చర్యలు చేపట్టి కిరణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. కిరణ్ మృతి విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు, బంధువులు బావి వద్దకు చేరుకోని కన్నీరుమున్నీరయ్యారు. మూడేళ్ల క్రితమే కిరణ్ తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి సుజాత పొలం పనులు చేసుకుంటూ పిల్లలను పెంచుతోంది. ఇప్పుడు రెండో కుమారుడు కూడా మరణించడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
విషాదం: బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు యువకుడు మృతి - గుంటూరు జిల్లాలో ఈతకు వెళ్లి యువకుడు మృతి
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇరుకుపాలెం గ్రామంలో ఓ యువకుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
కిరణ్ మృతదేహన్ని బయటకు తీస్తున్న ఫైర్ సిబ్బంది