బాపట్ల మండలం సూర్యలంక ఎస్సీ కాలనీకి చెందిన 9 ఏళ్ల బాలికపై.. ఓ యువకుడు అత్యాచారనికి యత్నించాడు. సముద్రతీరంలో తాబేళ్లు సంరక్షణ కేంద్రం వద్ద పనిచేస్తున్న గౌరీ శంకర్(27) మద్యం మత్తులో.. నిద్రిస్తున్న బాలికను తీసుకువెళ్లి అత్యాచారానికి యత్నించాడు. భయాందోళనతో బాలిక.. కేకలు వేయటంతో గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలికను బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బాలికపై యువకుడు అత్యాచార యత్నం.. - సూర్యలంక మైనర్ బాలికపై అత్యాచారం కేసు తాజా సమాచారం
గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
![బాలికపై యువకుడు అత్యాచార యత్నం.. బాలికపై అత్యాచార యత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11222536-315-11222536-1617177880400.jpg)
tried to rape a minor girl