పనికి వెళ్లటం లేదని తండ్రి మందలించాడనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడులో జరిగింది.
పనికి వెళ్లలేదని అడిగితే... ప్రాణం తీసుకున్నాడు - వేములూరిిపాడు ఆత్మహత్య వార్తలు
తండ్రి మందలించాడని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వేములూరిపాడులో జరిగింది.
![పనికి వెళ్లలేదని అడిగితే... ప్రాణం తీసుకున్నాడు son suicide in vemulapaudu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8189505-791-8189505-1595845953246.jpg)
కుమారుడు ఆత్మహత్య
గ్రామానికి చెందిన పచాల యోహాను మూడో కుమారుడు చందు.. స్థానికంగా కంపెనీలో పనికి వెళ్లేవాడు. కొద్ది రోజులుగా చందు పనికి వెళ్లకపోవటంతో.. యోహాను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన చందు.. ఇంటిలో ఉన్న గడ్డి మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చందు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.