గుంటూరు జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. మేడికొండూరు మండలం ఎలవర్తిపాడు గ్రామానికి చెందిన యేరసాని రాజు.. గతంలో వాలంటీర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో రైతు భరోసా కేంద్రంలో 15 ఎరువుల కట్టలు మాయమయ్యాయి. ఈ ఘటనకు.. రాజును బాధ్యున్ని చేస్తూ.. వ్యవసాయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే రాజును కొందరు వ్యక్తులు.. కులం పేరుతో దూషించి అవమానకరంగా మాట్లాడారట. తీవ్ర మనస్తాపానికి గురైన రాజు.. శీతల పానీయంలో పురుగు మందు కలుపుకుని తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.