ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా బాధితుడి కోసం... యువకుడు సాహసం - సత్తెనపల్లి కరోనా వార్తలు

కరోనా చాలా మందిలో మానవత్వాన్ని మంట గలుపుతుంటే... మరికొందరిలో సేవా గుణాన్ని బయటకు తీస్తోంది. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నా కరోనా భయంతో సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాని ఘటనలు చదివే ఉంటారు. అయితే కరోనా పాజిటివ్​గా తేలిన వ్యక్తికి సాయం చేసేందుకు ధైర్యంగా ముందుకు వచ్చాడు ఓ యువకుడు. డ్రైవర్​గా మారి అతని ప్రాణాలు నిలిపాడు.

young man helped the corona victim in sattenapalli
young man helped the corona victim in sattenapalli

By

Published : Jul 29, 2020, 8:04 PM IST

ఆపత్కాలంలో కరోనా బాధితుడికి అండగా నిలిచాడు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన నరేశ్ అనే యువకుడు. వైరస్ సోకిన వ్యక్తిని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన సమయంలో డ్రైవర్​గా మారాడు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ ఉపాధ్యాయుడికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్​గా తేలింది. అయితే లక్షణాలు లేకపోవటంతో అతడిని హోం ఐసోలేషన్​లో ఉండాలని అధికారులు సూచించారు. అయితే మంగళవారం రాత్రి అతను అస్వస్థతకు గురయ్యారు. బాధితుడికి గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఇబ్బందిగా మారింది. స్థానిక వైద్యులు అతడిని గుంటూరుకు తీసుకెళ్లాలని సూచించారు. అదే సమయంలో స్థానిక 108 వేరే రోగిని ఆసుపత్రికి తరలించేందుకు వెళ్లింది.

బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానిక వ్యక్తులు కొందరు ఓ ప్రైవేటు అంబులెన్సును సమకూర్చారు. అయితే ఆ అంబులెన్స్ డ్రైవర్ కరోనా రోగిని తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. అదే ప్రాంతానికి చెందిన నరేశ్ అనే యువకుడు తనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని... రోగిని అంబులెన్స్ లో తీసుకెళ్తానని ముందుకొచ్చాడు. వెంటనే అధికారులు అతనికి ఓ పీపీఈ కిట్ అందజేశారు. ఆ యువకుడు దానిని ధరించి రోగిని గుంటూరు తీసుకెళ్లాడు. నరేశ్ చూపిన చొరవను స్థానికులు అభినందించారు.


ఇదీ చదవండి

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 10,093 కేసులు

ABOUT THE AUTHOR

...view details