రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంపురం మండలం నుదురుపాదులో జరిగింది.
నుదురుపాదుకు చెందిన పొలిశెట్టి పోతురాజు, అతని రెండవ కుమారుడు రవికిరణ్ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. అదే సమయంలో గ్రామానికి చెందిన ఉప్పు నవీన్ కుమార్ అటుగా వెళ్తూ ఎదురుగా వస్తున్న పోతురాజు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ప్రమాదంలో రవికిరణ్ తలకు గాయం కాగా గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు.