గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రాయల సురేశ్.. 11 మంది స్నేహితులతో కలిసి సూర్యలంక వద్ద సముద్ర స్నానానికి వెళ్లాడు. సముద్రంలో స్నానం చేస్తూ అలల తాకిడికి నీటిలో మునిగిపోయాడు. రెస్క్యూ టీం కాపాడేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం దక్కలేదు. ఎక్కువ లోతుకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించినప్పటికి వారి మాటలను పట్టించుకోలేదు. కొంత సమాయానికి యువకుడి మృతదేహం ఒడ్డుకు చేరింది. సురేశ్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు మృతి - గుంటూరు జిల్లా నేర వార్తలు
గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో విషాదం జరిగింది. సూర్యలంక వద్ద సముద్ర స్నానానికి... స్నేహితులతో వచ్చిన ఓ యువకుడు అలల తాకిడికి నీటిలో కొట్టుకుపోయాడు.
మృతి చెందిన యువకుడు