Young man suicide in Hyderabad : తెలంగాణలోని హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన సాయికుమార్(23) సీపీఎం కార్యాలయంలో సోషల్ మీడియా ఎడిటర్. తమ్ముడు సెల్‌ఫోన్ కొనుక్కునేందుకు దాచుకున్న డబ్బును వాడుకోవడంతో ఇటీవల తల్లి సాయికుమార్‌ను మందలించింది. సోమవారం ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. కొంత సమయం తరువాత తల్లి గమనించి స్థానికుల సాయంతో తలుపు పగులగొట్టి చూడగా సీలింగ్ ఫ్యానుకు చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు.
నేను సరైన కొడుకుని కాదు.. తమ్ముడిని బాగా చూసుకోండి - suicide in balanagar
Young man suicide in Hyderabad : ‘అమ్మా.. నాన్నా.. నేను తప్పులు చేశాను.. సరిదిద్దుకోలేకపోతున్నాను.. నేను సరైన కొడుకుని కాదు.. తమ్ముడిని బాగా చూసుకోండి’ అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో యువకుడు ఆత్మహత్య
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో.. ‘తప్పులు చేశాను.. సరిదిద్దుకోలేకపోతున్నాను.. నేను సరైన కొడుకుని కాదు.. తమ్ముడిని బాగా చూసుకోండి’ అంటూ రాసి ఉంది.
ఇవీ చదవండి :