గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలుకు చెందిన రావూరి శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీపీసీ రోడ్డులోని హెచ్పీ గ్యాస్ వెనుక విషపు గుళికలు తిని తెల్లవారుజామున ఆఘాయిత్యానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు నిడుబ్రోలు పీబీఎన్ కాలేజీ రోడ్డులో నివసిస్తున్న రావూరి శివ ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
మద్యానికి బానిస..
మద్యానికి బానిసైన శివ తరచూ మందు తాగుతుండటంతో కుటుంబ సభ్యులతో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుటుంబీకులకు ఫోన్ చేసి తాను విషపు గుళికలు తిని చనిపోతున్నట్లు చెప్పడంతో.. నివాస పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా కనపడకపోవడంతో ఆందోళన చెందారు. స్వతాహగా శివ ధైర్యవంతుడు కావడంతో ఎలాంటి దారుణాలకు పాల్పడే అవకాశం లేదనే నమ్మకంతో తల్లిదండ్రులు ఉన్నారు.