Cheating in the name of love: ప్రేమించి పెళ్లి చేసుకొని కలిసున్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఓ ప్రబుద్ధుడిపై హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ ప్రాంతానికి చెందిన మహిళ(26) నగరంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఆమెకు నిఖిల్(25) పరిచయమై.. ప్రేమిస్తున్నానని నమ్మించి గతేడాది నవంబరులో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల పాటు ఎవరింట్లో వారున్న తరువాత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కలిసి ఉంటున్నారు. ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్న నిఖిల్.. మద్యానికి బానిసై డబ్బు కోసం భార్యను వేధించేవాడు. రూ.4 లక్షల వరకు పలు దఫాలుగా బాధితురాలి నుంచి తీసుకున్నాడు. ఇటీవల ఇద్దరూ కలిసున్న సమయంలో తీసిన వీడియోలు, ఫొటోలు చూపి.. డబ్బులివ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు శనివారం ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని.. వీడియోలు తీసి బెదిరింపులు
Cheating in the name of love: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాని చేసేందుకు ఉద్యోగం లేదు. భార్యతో కలిసున్న ఆనంద సమయంలో తీసిన వీడియోలు, ఫొటోలను చూపిస్తూ.. సొంత భార్యనే బ్లాక్ మెయిల్ చేయసాగాడు. కొన్ని డబ్బులు సర్దిన ఆ ఇల్లూలు, వేధింపులు తీవ్రం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో చోటుచేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకుని వీడియోలు తీసి బెదిరింపులు