ప్రేమ వ్యవహారం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు చెందిన బండారు గోపి..అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే, వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో కిరాయి ముఠాతో యువకుడిని చంపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Murder: యువకుడి దారుణ హత్య..ప్రేమ వ్యవహారమేనా..! - Young man brutally murdered over love affair at guntur news
ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య
20:13 October 11
యువకుడి దారుణ హత్య
తమ కుమారుడు కనిపించడం లేదంటూ గోపీ తల్లిదండ్రులు పోలీసులకు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. గోపిని అదే గ్రామానికి చెందిన పల్లపు సాంబయ్య, గుండాల నవీన్, గుంజి శ్రీకాంత్ బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు వారు ఆరోపిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ముట్లూరు సమీపంలోని అప్పాపురం వాహినిలో గోపి మృతదేహాన్ని గుర్తించారు. విచారణలో గోపి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధరించారు.
ఇదీ చదవండి
Last Updated : Oct 11, 2021, 9:40 PM IST