ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

attack with knife: ప్రేమించాలంటూ కత్తితో వీరంగం - arandal peta news

arandal peta
కత్తితో యువకుడు దాడికి యత్నం

By

Published : May 31, 2021, 3:49 PM IST

Updated : May 31, 2021, 4:58 PM IST

15:45 May 31

attack with knife: కత్తితో యువకుడి హల్​చల్

కత్తితో యువకుడి హల్​చల్

గుంటూరు అరండల్ పేటలో ఓ యువకుడు కత్తి(attack with knife)తో హల్‌చల్ చేశాడు. అరండల్ పేట పార్క్ సమీపంలోని టీ దుకాణం వద్ద ఉన్న ఓ యువతి, ఆమెతోపాటు ఉన్న యువకుడిపై కత్తి(attack with knife)తో దాడికి యత్నించాడు. ప్రేమిస్తున్నానంటూ కొన్నాళ్లుగా యువతి వెంట పడుతున్న నిందితుడు.... ఆమెతో పాటు ఇంకో యువకుడిని చూసి రెచ్చిపోయాడు. ఆ యువకుడిపై కత్తితో దాడి చేయబోయాడు. ఈ దాడిని యువతి అడ్డుకుంది. ఆ తర్వాత మరింత చెలరేగిన నిందితుడు.... వారి బైక్ సీటుపై కత్తితో గాట్లు పెట్టాడు. వాహనాన్ని కాలితో తన్నుతూ, వారిని నిందిస్తూ వీరంగం చేశాడు. ఈ ఘటనతో యువతితోపాటు ఆమె వెంట ఉన్న యువకుడు వణికిపోయారు. ఎప్పుడేం జరుగుతుందో అని ఆందోళన చెందారు. ఇదంతా గమనించిన చుట్టుపక్కల వారు టీ దుకాణం వద్దకు చేరుకోవడం చూసిన నిందితుడు.... అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఈ ఘటనపై అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. 

ఇదీ చదవండి:బెజవాడ గ్యాంగ్​వార్​ నిందితుడు పండు మరోసారి అరెస్ట్​

Last Updated : May 31, 2021, 4:58 PM IST

ABOUT THE AUTHOR

...view details