గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో విషాదం జరిగింది. గుంటూరుకు చెందిన నలుగురు యువకులు సీతానగరం వద్ద పుష్కర ఘాట్లో స్నానానికి కృష్ణానదిలోకి దిగారు. నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఇద్దరు యువకులు వెంటనే బయటకు వచ్చారు. మిగిలిన ఇద్దరు యువకుల్లో ఒకరైన నవీన్ గల్లంతు కాగా.. మరొకరు క్షేమంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజ ఈత గాళ్ల సహాయంతో గాలించారు. నవీన్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
కృష్ణానదిలో స్నానానికి దిగిన యువకుడు.. నీటి ఉద్ధృతి కారణంగా మృతి - man died in krishna river at Sitanagaram Pushkara Ghat
మిత్రులతో కలిసి స్నానం కోసం కృష్ణానదిలోకి దిగిన ఓ యువకుడు.. నీటి ఉద్ధృతి కారణంగా మృతి చెందారు. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో జరిగింది.
యువకుడు మృతి