ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేడికొండూరు చెరువులో పడి యువకుడు మృతి - గుంటూరు జిల్లా యువకుడు మృతి

గుంటూరు జిల్లా మేడికొండూరు గ్రామంలో విషాదం జరిగింది. గ్రామంలోని చెరువులో పడి మస్తాన్​వలి అనే యువకుడు మృతి చెందాడు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే మస్తాన్​వలీ కుటుంబం వ్యాపారం నిమిత్తం తెలంగాణ రాష్ట్రం వరంగల్​లో జీవిస్తున్నారు. కొన్ని నెలల కిందట జిల్లాలోని మేడికొండూరులో బంధువుల ఇంటికి వచ్చి లాక్​డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. మస్తాన్​వలీ మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.

young boy died falling in pond at medikondur in guntur district
మేడికొండూరులోని చెరువులో పడి యువకుడు మృతి

By

Published : Jun 24, 2020, 12:40 PM IST

గుంటూరుకు చెందిన సైదాబీకి అమరావతి మండలం లేమల్లెకు చెందిన షేక్ ఇమామ్ వలీతో 30 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు మస్తాన్​వలీ ఏడో తరగతి చదివాడు. ఇమామ్ వలీ, సైదాబీ కుర్చీలు తయారు చేస్తుంటారు. వ్యాపార నిమిత్తం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా తొర్రూరు​లో జీవిస్తున్నారు. కొన్ని నెలల కిందట మేడికొండూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు.

మంగళవారం ఉదయం మస్తాన్​వలీ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చి బంధువులు వెతుకుతుండగా... గ్రామంలోని తాగునీటి చెరువు వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు వెళ్లి పరిశీలించగా యువకుడి చెప్పులు చెరువు కట్టపై కనిపించాయి. చెరువులో పడి ఉంటాడని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో వెతికించగా...వలీ శవమై కనిపించాడు. మస్తాన్​వలీ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details