కరోనా నియంత్రణపై గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు, అవగాహన సదస్సు నిర్వహించారు. సంపత్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో జీఎంసీ కమిషనర్ చల్లా అనూరాధ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఇండియన్ యోగా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పతంజలి శ్రీనివాస్ కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి అవసరమైన యోగాసనాలను.. యోగా వలన కలిగే ప్రయోజనాలను నగరపాలక సిబ్బందికి వివరించారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనా వైరస్ని విజయవంతంగా ఎదుర్కోవచ్చని శ్రీనివాస్ అన్నారు.