ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముఖ్యమంత్రి మనసు మారాలని ప్రార్థిస్తున్నాం' - errabalam farmers protest news in telugu

రాజధాని వికేంద్రీకరణ ప్రతిపాదనలను నిరసిస్తూ గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో రైతులు వంటావార్పు నిర్వహించారు. శుక్రవారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అమరావతికి అనుకూల ప్రకటన రావాలంటూ దేవుడిని ప్రార్థించామన్నారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/26-December-2019/5496294_rajadhani.mp4
రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ ఎర్రబాలెంలో రైతులు వంటావార్పు

By

Published : Dec 26, 2019, 11:02 AM IST

రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ ఎర్రబాలెంలో రైతులు వంటావార్పు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని రైతులు ఆందోళనలు కొనసాగించారు. రాజధాని వికేంద్రీకరణ ప్రతిపాదనలను నిరసిస్తూ వంటావార్పు నిర్వహించారు. స్థానిక కూడలిలో మహిళలు రైతులు వంటావార్పు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. శుక్రవారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అమరావతికి అనుకూల ప్రకటన చేసేలా ముఖ్యమంత్రి మనసు మార్చాలంటూ రైతులు దేవుడిని వేడుకొన్నారు. 3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details