ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాకు ప్రచారం చేసినందుకు.. గెంటేశారు! - గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం

తెదేపాకు అనుకూలంగా ఉండేవారిపై వైకాపా నేతల ఆగడాలు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో తెదేపాకు ప్రచారం చేశారన్న కారణంతో.. తన ఇంట్లో అద్దెకున్న ఓ కుటుంబాన్ని వైకాపా నేత గెంటేసిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.

అద్దెకుండేవారిపై వైకాపా మద్దతుదారుల ఆగడాలు

By

Published : Apr 10, 2019, 4:37 PM IST

గుంటూరు జిల్లా కందులవారిపాలెంలో వైకాపా మద్దతుదారుల ఆగడాలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో బంగారు శేషాచారి కుటుంబం.. వైకాపాకు చెందిన బూతు చినలక్ష్మారెడ్డి ఇంట్లో ఏడాది నుంచి అద్దెకుంటున్నారు. శేషాచారి తెదేపా తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో యజమాని ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశించారు. దీనికి ఆయన ఒప్పుకోలేదు. ఆగ్రహించిన లక్ష్మారెడ్డి ఇంట్లోని సామానులను బయటపడేశారు. చేసేదేమీ లేక అర్ధరాత్రి 12 గంటలప్పుడు తెదేపా నాయకులు అంజిరెడ్డి సహకారంతో మరో ఇంట్లోకి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details