రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికే సీఎం జగన్... దిల్లీలో పర్యటించారని వైకాపా రాజ్యసభ సభ్యులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, విభజన చట్టం హామీలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చర్చించారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజధాని భూముల వ్యవహారం సహా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారని మరో ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు.
'రాష్ట్ర సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన' - సీఎం దిల్లీ పర్యటన వార్తలు
రాష్ట్ర సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీలో పర్యటించారని వైకాపా రాజ్యసభ సభ్యులు అన్నారు.
రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్
Last Updated : Sep 23, 2020, 8:11 PM IST