ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు సీట్లతో కేసీఆర్ తెలంగాణ సాధించలేదా?: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు - ఏపీకి ప్రత్యేక హోదా వార్తలు

ప్రత్యేక హోదా కోసం వైకాపా పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు చెడు జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

ycp-mp-srikirshna-devarayalu-comments-on-special-categery-status-to-ap
ycp-mp-srikirshna-devarayalu-comments-on-special-categery-status-to-ap

By

Published : Dec 17, 2019, 5:29 PM IST

రెండు సీట్లతో కేసీఆర్ తెలంగాణ సాధించలేదా?:ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని... వైకాపా తరపున పోరాటం కొనసాగుతుందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పష్టం చేశారు. ఆరు నెలల కాలంలో పార్లమెంటులో చాలాసార్లు హోదా అంశాన్ని ప్రస్తావించామని గుర్తు చేశారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన అంశాన్ని మీడియా ప్రతినిధులు గుర్తుచేయగా... ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ సాధించలేదా అని ప్రశ్నించారు. విభజనతో రాష్ట్రానికి రావాల్సిన రెవిన్యూ లోటులో 3,500 కోట్లను కేంద్రం ఇచ్చిందని ఎంపీ చెప్పారు. పౌరసత్వ సవరణపై ప్రజల్లో అపోహలున్నాయన్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు... ముస్లింలకు చెడు జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details