YCP LEADERS: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచేందుకు ప్లీనరీలో అవసరమైన కార్యాచరణపై దృష్టి సారిస్తామని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించే ప్లీనరీ పనులను ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పరిశీలించారు. జులై 8, 9వ తేదీలలో ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తున్నామని విజయసాయి రెడ్డి చెప్పారు. ఇతర పార్టీల కంటే భిన్నంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అప్పుడు నవరత్నాలతో గెలిచాం.. ఇప్పుడు ఇలా చేస్తాం : సజ్జల, విజయసాయి - గుంటూరు జిల్లా తాజా వార్తలు
YCP LEADERS: గత ప్లీనరీలో నవరత్నాలను ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చామని.. ఈసారి మరిన్ని మెరుగైన కార్యక్రమాలను చేపట్టి తిరిగి అధికారంలోకి వస్తామని వైకాపా నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 8, 9వ తేదీన గుంటూరులో జరిగే ప్లీనరీ ఏర్పాట్లను ఎంపీ విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ పరిశీలించారు.
గత ప్లీనరీలో నవరత్నాలను ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చామని.. ఈసారి మరిన్ని మెరుగైన కార్యక్రమాలను చేపట్టి తిరిగి అధికారంలోకి వస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్లీనరీకి వచ్చే నాయకులను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానిస్తారన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు హోదాలో విజయమ్మ ప్లీనరీలో పాల్గొంటారని సజ్జల తెలిపారు. ఏపీ రాజకీయ చిత్రపటంపై వైకాపా ప్లీనరీ తనదైన ముద్ర వేస్తుందన్నారు. పాలనలో సామాజిక విప్లవం తెచ్చిన ఏకైక నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్ చిరస్థాయిగా మిగిలిపోతారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేస్తారని శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.
ఇవీ చదవండి: