పిడుగురాళ్ల జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమారుడు కోటయ్య వచ్చారు. ఆయనకు మద్దతుగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కాసు మహేశ్‌రెడ్డి, ముస్తఫా, జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. మక్కెన మల్లికార్జునరావు, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామిరెడ్డి, పదుల సంఖ్యలో నాయకులు రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లారు. ప్రతిపక్ష తెదేపా, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి నామినేషన్ వేసేందుకు వచ్చిన వారి వెంట ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ అధికారుల తీరు చర్చనీయాంశమైంది.
'అధికార పార్టీ అభ్యర్థులైతే నిబంధనలు వర్తించవా..?' - election rules
గుంటూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నామపత్రాల సమర్పణకు అభ్యర్థి, మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అధికార పక్షానికి చెందిన ఓ నేత కుమారుడు నామినేషన్‌కు ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి అభ్యర్థితో కలిసి నామపత్రాన్ని సమర్పించారు. ముగ్గురికి మించి అనుమతించబోమని చెప్పిన అధికారులు... ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను అనుమతించటం చర్చనీయాంశమైంది.
'అధికార పార్టీ అభ్యర్థులైతే నిబంధనలు వర్తించవా..?'