YCP LEADERS SUBMIT FORM7 TO REMOVE TDP VOTERS : అధికార వైసీపీ నేతల ఆగడాలకు అంతే లేకుండా పోతోందని గుంటూరు వాసులు గగ్గోలు పెడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన వైసీపీ వ్యతిరేక ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు వందల సంఖ్యలో తొలగించాలని వైసీపీ నేతలు ఫామ్-7లు పెట్టడం కలకలం రేపింది. ఐదుగురు వ్యక్తులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 805 ఓట్లు తొలగించాలని నవంబరు 3, 4తేదీల్లో ఫామ్-7లు దరఖాస్తు చేసిన విషయం బీఎల్వోల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఒకే సామాజికవర్గానికి చెందినవారి ఓట్లను అధికారపార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులు వందల సంఖ్యలో తొలగించాలని దరఖాస్తు చేయడం దుమారం రేపుతోంది.
'వైసీపీతో పెట్టుకుంటే ఓట్లు గల్లంతే' ఒకరి ఓటు తొలగించాలని మరొకరి దరఖాస్తు - షాక్ అవుతున్న ఉద్యోగులు, సామాన్య ఓటర్లు ప్రతిపక్షాల సానుభూతిదారుల ఓట్ల ఏరివేతకు 'ఫామ్-7' వాడుతున్న వైసీపీ నేతలు - ఓటు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుల ఆగ్రహం
గుంటూరులో కలకలం.. ఫామ్ 7 ను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు వందలాది ఓటర్లను తొలగించాలని దరఖాస్తు చేయడం గుంటూరులో కలకలం సృష్టించింది. కొండా శేషిరెడ్డి 202, పులుసు వెంకటరెడ్డి 136, సిద్ది వెంకాయమ్మ 149, చల్లా శేషిరెడ్డి 159, రాము 159 కలిపి మొత్తం 805 ఫామ్-7 దరఖాస్తులు పెట్టారు. ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులకు సంబంధించి అధికారపార్టీ వైసీపీ నేతల ఆగడాలకు అంతేలేకుండా పోతోందని నగర ఓటర్లు మండిపడుతున్నారు. ఓటమి భయంతో స్థానికనేతలు ఫామ్-7ను అడ్డుపెట్టుకుని ఓటర్ల జాబితా నుంచి వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గుంటూరు నగరంలోని బ్రాడీపేట 2/19లోని 140పోలింగ్‌బూత్ (Polling booth) పరిధిలో ఒకే సామాజికవర్గానికి చెందిన 23 మంది ఓట్లు తొలగించాలంటూ వైసీపీ నేత కొండా శేషిరెడ్డి దరఖాస్తు చేయడంపై బాధిత ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 40ఏళ్లుగా స్థానికంగా ఉంటూ సొంతిల్లు కలిగి ప్రతి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకుంటుండగా ఉద్దేశపూర్వకంగా తమ ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆ మాజీ మంత్రికి మూడు చోట్లు ఓటు హక్కు! తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాతో వెలుగులోకి
వైసీపీ నేత దరఖాస్తు.. ఎస్వీఎన్ కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో 12 ఓట్లు తొలగించాలని పులుసు వెంకటరెడ్డి అనే వైసీపీ నేత దరఖాస్తు చేయడం పట్ల అపార్టుమెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటుహక్కు తొలగించమని దరఖాస్తు పెట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీస్తున్నారు. దరఖాస్తు చేసిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసినవారిలో విశ్రాంత ప్రిన్సిపాళ్లు, ఫ్రొఫెసర్లు, అధ్యాపకులు, పోలీసులు, వైద్యులతోపాటు ప్రస్తుత టీడీపీ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తదితరుల ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేయడం గమనార్హం. దీంతో నగరంలో అందరూ వారి ఓట్లు ఉన్నాయా? లేదా? అని తనిఖీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఓటర్ల జాబితా సవరణ నుంచే వైసీపీ నేతలు కుట్రలు అమలుచేస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఇందుకు నిదర్శనమే టీడీపీ బలంగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వందల సంఖ్యలో కేవలం ఒక సామాజిక వర్గం ఓట్లు తొలగించాలని దరఖాస్తులు పెట్టారని ఆరోపిస్తున్నారు.
ఓటరు జాబితాలో అవకతవకలు - ఒకే ఇంటి నెంబర్‌పై పదుల సంఖ్యలో ఓట్లు
ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం... 1994 నుంచి సొంతింటిలో ఇక్కడే నివాసం ఉంటున్నామని... ఇప్పుడు నా ఓటు తొలగించాలని ఎవరో దరఖాస్తు చేశారని బీఎల్‌వో (BLO)వచ్చి చెబితేనే... తెలిసిందని జాస్తి వాణికుమారి అనే విశ్రాంత ప్రిన్సిపల్ తెలిపారు. ఫామ్-7 ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పెడితే ఎలా? అలా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రిటైరైన మాఓట్లు తీసేయాలని చూస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మా ఇంట్లో ముగ్గురు ఓట్లు తొలగించాలని ఎవరో ఫామ్-7 దరఖాస్తు చేశారని.... ఎందుకు తొలగించాలని దరఖాస్తులు చేస్తున్నారో తెలియడం లేదని విశ్రాంత ఫ్రొఫెసర్ చదలవాడ వినయశ్రీ అన్నారు. ఉద్యోగం చేసే సమయంలో ఎన్నికల విధుల్లో భాగంగా పోరాటం చేసి మరీ ఓటు ఇప్పించి ప్రజాస్వామ్యం విలువలు కాపాడినట్లు పేర్కొన్నారు.ఇప్పటి ఎన్నికల్లో ఓటు వేస్తే మరో ఎన్నికకు ఉంటామో.. లేదోతెలియని వయసులో ఉన్నామని, అర్హులైన అందరికీ ఓటుహక్కు లేకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటమి భయంతో... జేకేసీ కళాశాల రోడ్డులోని ఎస్వీఎన్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో 30 మంది నివాసం ఉంటుండగా... వారిలో 12 మంది ఓట్లు తొలగించాలని పులుసు వెంకటరెడ్డి అనే వైసీపీ నేత దరఖాస్తు చేయడం పట్ల అపార్ట్ మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాఓటు, మానాన్న ఓటు తొలగించాలని ఫామ్-7 ద్వారా దరఖాస్తు చేసినట్లు గుర్తించామని, మా ఓట్లు తొలగించాలని దరఖాస్తు (Application) చేయడానికి వైసీపీ నేతలకు హక్కు ఎవరిచ్చారని మేడా చంద్రబోస్ బాబు అనే ఓటరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో వైసీపీ నేతలు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ చర్యలపై న్యాయపరంగానూ పోరాటం చేస్తామన్నారు.
మొక్కుబడిగా ఓటరు జాబితా సవరణ - భారీగా అవకతవకలు, బీఎల్వోల తీరుపై ఓటర్ల అసహనం