ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు ఆలోచనతో.. భాజపాలోకి తెదేపా నేతలు - భాజపాలోకి తెదేపా నేతలు

సీఎం జగన్​పై తెదేపా నేతలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ తిరిగి ఆరోపణలు చేస్తున్నారని వైకాపా నేతలు ఆరోపించారు. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందని వైకాపా నేత రామచంద్రయ్య ఆరోపించారు. వ్యూహాత్మకంగానే చంద్రబాబు తెదేపా నేతలను భాజపాలోకి పంపారన్నారు. సామాజిక మాధ్యమాల ప్రచారంపై తెదేపా చర్చకు సిద్ధమా అని వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ సవాల్ విసిరారు.

చంద్రబాబు ఆలోచనతో.. భాజపాలోకి తెదేపా నేతలు :

By

Published : Oct 4, 2019, 10:31 PM IST

చంద్రబాబు ఆలోచనతో.. భాజపాలోకి తెదేపా నేతలు

ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైకాపా నేతలు ఆరోపించారు. సీఎం జగన్ పై సామాజిక మాధ్యమాలలో తెదేపా తప్పుడు ప్రచారం చేస్తూ... వైకాపాపై నిందలు వేస్తుందని విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైకాపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సి. రామచంద్రయ్య, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ మాట్లాడారు. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబే వ్యూహాత్మకంగా తెదేపా నేతలను భాజపాలోకి పంపించారన్నారు. సామాజిక మాధ్యమాలపై తెదేపా చేస్తున్న ఆరోపణలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని శాసనసభ్యుడు టీజేఆర్ సుధాకర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details