ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నేతలు మండలిలో నానా హంగామా చేశారు' - ఏపీ శాసన మండలి వార్తలు

శాసన మండలిలో జరిగిన పరిణామాలపై వైకాపా నేతల వ్యాఖ్యలను తెలుగుదేశం తిప్పికొట్టింది. అధికార పార్టీ నేతలు మండలిలో నానా హంగామా చేశారని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చెప్పారు. ఛైర్మన్​ను సైతం దుర్భాషలాడారని వెల్లడించారు.

tdp mlc bachula arjunudu
tdp mlc bachula arjunudu

By

Published : Jun 17, 2020, 9:36 PM IST

మీడియాతో తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

మండలిలో 6 బిల్లులు ఆగిపోయాయని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడు తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొందలేదని వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి 18మంది మంత్రులు మండలిలో కవ్వింపు చర్యలకు దిగారని మండిపడ్డారు.

'వైకాపా నేతలు మండలిలో నానా హంగామా చేశారు. 18 మంత్రులు మమ్మల్ని దుర్భాలాడారు. ఛైర్మన్‌ను సైతం దుర్భాషలాడారు. 16 బిల్లుల్లో 10 బిల్లులకు ఆమోదం తెలిపాం. ఫోటోలు తీశారంటూ అబద్ధాలు చెబుతున్నారు' అని బచ్చుల అర్జునుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details