పేరేచర్లలో తెదేపా కార్యకర్తపై దాడి..పోలీసులకు ఫిర్యాదు - guntur district latest news
గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త రామాంజనేయులుపై వైకాపాకు చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై రామాంజనేయులు మేడికొండూరు పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త రామాంజనేయులుపై వైకాపాకు చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. బాధితుడు మేడికొండూరు పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రామాంజనేయులుకు పేరేచర్ల జంక్షన్లో కొంత స్థలం ఉండగా దానిలో షెడ్డు నిర్మిస్తున్నాడు. చుట్టుప్రక్కల వారు అతని స్థలంలో చెత్తచెదారం వేస్తున్నారన్న విషయంలో అతనికి మరో ఇద్దరికి మాటామాటా పెరిగింది. ఇంతలో 20 మంది వ్యక్తులు అక్కడకు చేరుకుని ఒక్కసారిగా రామాంజనేయులుపై దాడి చేశారు. దాడి చేసిన వారిలో వైకాపాకు చెందిన కందుల సిద్ధయ్య, మరికొందరు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.