ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాచేపల్లిలో యువకులపై వైకాపా నేత దాడి - guntur-district updates

దాచేపల్లిలో యువకులపై వైకాపా నేత దాడి
దాచేపల్లిలో యువకులపై వైకాపా నేత దాడి

By

Published : Aug 25, 2021, 8:02 PM IST

Updated : Aug 26, 2021, 5:30 AM IST

19:57 August 25

యువకులపై వైకాపా నేత దాడి

వైకాపా నేత, దాచేపల్లి జడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి బంధువులు బుధవారం సాయంత్రం పలువురిపై కారం చల్లి కర్రలతో దాడి చేసి వీరంగం చేశారు. దాడికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దాచేపల్లిలోని ఇందిరానగర్‌ కాలనీలో వైకాపా నేత ప్రకాష్‌రెడ్డి, అతని బావమరుదులు నివసిస్తున్నారు. వారికి చెందిన కారు ఇంటి పక్కనే ఉన్న సర్వీసు రోడ్డుపై పెట్టారు. దాచేపల్లి, నారాయణపురానికి చెందిన కొప్పుల గిరి, అనిశెట్టి రమేష్‌ తదితరులకు అదే మార్గంలో ఇళ్ల స్థలాలున్నాయి. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా అందులోకి మట్టి తోలుకుంటున్నారు. ఆ మార్గంలో కారు అడ్డుగా ఉందని, పక్కన పెట్టాలని గిరి, రమేష్‌ చెప్పడంతో వారు అభ్యంతరం తెలిపారు. సర్వీసు రోడ్డులో తిరగడానికి వీల్లేదని చెప్పడంతో వివాదం నెలకొంది. వైకాపా నేత ప్రకాష్‌రెడ్డి కుటుంబసభ్యులు, సమీప బంధువులు ఇంట్లో నుంచి కారంపొడి తీసుకొచ్చి గిరి, రమేష్‌ తదితరులపై చల్లి కర్రలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న వారిద్దరి బంధువులు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా ఆందోళన చేశారు. అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రకాష్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో రోడ్డుపై కూర్చున్న బాధితులతో పోలీసులు మాట్లాడటంతో వారంతా అంకమ్మతల్లి ఆలయం వద్దకెళ్లి సమావేశమయ్యారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దాచేపల్లి పోలీసులు ఆ ప్రాంతంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. దీనిపై పోలీసుల వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. 

ఇదీ చదవండి:  జడ్పీ హైస్కూల్‌లో విద్యుదాఘాతం.. పదో తరగతి విద్యార్థి మృతి

Last Updated : Aug 26, 2021, 5:30 AM IST

ABOUT THE AUTHOR

...view details