ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏ పని జరగాలన్నా... మా ఎమ్మెల్యేకు ముడుపులు చెల్లించాల్సిందే' - బెజ్జం రాంబాబు వార్తలు

వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై సొంత పార్టీ నాయకుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేకు ముడుపులు చెల్లించనిదే నియోజకవర్గంలో ఏ పని కాదని ఆరోపించారు. ఆమె పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ycp leader makes sensational comments against Tadikonda MLA sridevi
ycp leader makes sensational comments against Tadikonda MLA sridevi

By

Published : Jan 9, 2020, 11:44 PM IST

మీడియా సమావేశంలో బెజ్జం రాంబాబు

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అవినీతికి అడ్డు అదుపూ లేకుండా పోయిందని వైకాపా యువజన విభాగం నాయకుడు బెజ్జం రాంబాబు విమర్శించారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేకి ముడుపులు చెల్లించాల్సిందేనని విమర్శించారు. తాడికొండ మార్కెట్ యార్డ్ సొసైటీ పదవులు మొత్తం ఎమ్మెల్యే శ్రీదేవి అమ్ముకున్నారని ఆరోపించారు. మార్కెట్ యార్డ్ పదవులు కట్టబెట్టేందుకు ఓసీలకు ఐదు లక్షలు, అణగారిన వర్గాల వారి నుంచి రెండేసి లక్షలు చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. అవినీతి లేని పాలన అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే... తమ ఎమ్మెల్యే అవినీతికి చిరునామాగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుళ్లూరు మండల యువజన విభాగం అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details