గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నేత దాష్టీకానికి ఎస్టీ మహిళ బలైంది. అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడు వైకాపా నాయకుడు.
అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు - మహిళను వైకాపా నాయకుడు హత్య వార్తలు
19:38 August 03
అప్పు తీర్చలేదని ఆయువు తీశాడు
నకరికల్లు మండలం శివాపురం గ్రామానికి చెందిన రమావత్ మంత్రూబాయి దంపతులు... బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద పొలం తాకట్టు పెట్టి 3.80 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు శ్రీనివాసరెడ్డి. ఈ క్రమంలో పొలంలో ఉన్న మంత్రూబాయిపైకి ట్రాక్టర్ పోనిచ్చాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. శ్రీనివాసరెడ్డిది నకరికల్లు మండలం నర్సింగపాడు. ఆ గ్రామంలో వైకాపా కీలకనేతగా ఉన్నాడు.
మంత్రూబాయి తాకట్టు పెట్టింది అసైన్డ్ భూమి. అయితే ఏళ్ల తరబడి ఆమె కుటుంబం సాగు చేసుకుంటుండటంతో వాటిపై ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. నిబంధనల ప్రకారం ఆ భూమిని ఎవరూ తాకట్టు పెట్టుకోకూడదు. కానీ శ్రీనివాసరెడ్డి ఆ భూమిని అప్పు పేరిట తాకట్టు పెట్టుకుని... డబ్బు తిరిగి ఇవ్వనందుకు ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపాడు. నకరికల్లు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి