ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నామినేషన్​ ఉపసంహరణకు రూ.5 లక్షలు

ఎన్నికల్లో విజయం సాధించడానికి వైకాపా నేతలు అన్ని అస్త్రాలు సంధిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వైకాపా నేతలు బేరాలకు తెరలేపారు. ప్రత్యర్థికి రూ.5లక్షలు ఇచ్చి ఎంపీటీసీ స్థానానికి పోటీ లేకుండా చేసుకున్నారు.

ycp leader gave Rs 5 lakh to Tdp candidate for withdrawing the nomination
ycp leader gave Rs 5 lakh to Tdp candidate for withdrawing the nomination

By

Published : Mar 14, 2020, 8:51 AM IST

గుంటూరు జిల్లా గురజాల మండలంలోని ఓ గ్రామంలో ముగ్గురు వైకాపా నేతలు ఎంపీటీసీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడగా.. వేలం నిర్వహించి రూ.10.50 లక్షలకు ఒకరు బీ-ఫారం దక్కించుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు సమావేశమై ప్రజలకు నగదు పంచడం వంటివి లేకుండా ప్రత్యర్థి పార్టీకి ఒక ఆఫర్‌ ఇచ్చారు. నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే రూ.5 లక్షల నగదు, సదరు అభ్యర్థికి సంబంధించిన మూడున్నర ఎకరాల వివాదాస్పద భూమికి పట్టా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వేలంలో చెల్లించిన నగదు రూ.5 లక్షలు తెదేపా అభ్యర్థికి అందజేయటంతో బరిలో నుంచి తప్పుకున్నారు. దీనివల్ల ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. మిగిలిన రూ.5.50 లక్షలను మరో స్థానంలో ఖర్చు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details