గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో వైకాపాలో అసంతృప్తి నెలకొంది. ఎంపీపీ పదవి పోరులో వైకాపా నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. మండల కన్వీనర్ వాసు వర్గానికి ఎంపీపీ పదవి ఇస్తారని విషయం తెలియడంతో.. ఎంపీటీసీ కల్లూరి నాగేశ్వరరావు వర్గం వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ పదవి చెల్లి లక్ష్మీకి ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేశారు. రెండు వర్గాలు ఎంపీపీ పదవి కోసం పట్టు పట్టాయి. చెల్లి లక్ష్మికి ఎంపీపీ పదవి ఇవ్వకపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు రాజీనామా చేస్తామని కల్లూరి నాగేశ్వరరావు, సతీమణి అన్నపూర్ణ తెలిపారు. ఆందోళనలో ఎంపీటీసీ చెల్లి లక్ష్మీ సొమ్మసిల్లి పడిపోయారు.
mpp-elections: వైకాపాలో వర్గవిభేదాలను బయటపెడుతున్న ఎంపీపీ ఎన్నికలు
గుంటూరు జిల్లా పెందనందిపాడులో మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు.. వైకాపా(ycp)లో వర్గ విభేదాలను బయటపెడుతున్నాయి. మండల కన్వీనర్ వాసు, ఎంపీటీసీ కల్లూరి నాగేశ్వరరావు రెండు వర్గాలుగా విడిపోయారు. తమ వర్గం వారికే ఎంపీపీ పదవి ఇవ్వాలంటూ ఇరు వర్గాలు ఆందోళనలు దిగాయి.
ycp group politics fot mpp seat in pedanandipadu guntur district