YCP Govt Spoiled Education System in Andhra Pradesh: అంతా రివర్స్ - విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసిన వైసీపీ సర్కార్ YCP Govt Spoiled Education System in Andhra Pradesh: నోరు తెరిస్తే చాలు మీకు పేద పిల్లలు బాగుపడటం ఇష్టం లేదా? వాళ్లు అంగ్లం మాట్లాడటం ఇష్టం లేదా? మంచి చదువులిస్తామంటే వద్దంటారా అంటూ ప్రభుత్వ పాఠశాల విద్యను సంస్కరించడానికి వచ్చినట్లు మాట్లాడే జగన్ సర్కారు 18 వందల 62 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం కోసం అదే బడులకు తూట్లు పొడిచింది.
రుణం కోసం: ప్రపంచ బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి సర్కారు బడులను మూసేసింది. టీచర్ పోస్టులను రద్దు చేసింది. నిరుద్యోగుల పొట్టకొట్టింది. మానవ వనరులపై చేసే ఖర్చును తగ్గించుకుంటామని ప్రభుత్వమే స్వీయ నిబంధన పెట్టుకుంది. ఇందుకోసం ఉపాధ్యాయ నియామకాలను నిలిపేసింది. సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపేసి సెకండరీ గ్రేడ్ టీచర్లను సర్దుబాటు చేసేసింది.
7 వేల 752 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, SGT పోస్టులు రద్దు చేసింది. తరగతుల విలీనం కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి 587 ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. ప్రభుత్వ విధానంతో 13 వందల 65 ఎయిడెడ్ బడులు కాలగర్భంలో కలిసిపోయాయి. పిల్లల సంఖ్య తగ్గిపోయి ఏకోపాధ్యాయ బడుల సంఖ్య పెరిగిపోయింది. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు క్రమంగా తగ్గి ప్రైవేటుకు వలసపోతున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివేవారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల పిల్లలే ఉన్నారు.
రీ అడ్మిషన్ పేరుతో ఉత్తుత్తి ప్రవేశాలు చూపుతున్న సర్కారు - చందాలు వేసుకుని ఫీజులు చెల్లిస్తున్న ఉపాధ్యాయులు
ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేసి: రాష్ట్రంలో ఘన చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. వాటిని మూసేసేలా ప్రభుత్వం కక్ష కట్టి వ్యవహరించింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ఆస్తులతో సహా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని లేదంటే ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గినా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.
ఉపాధ్యాయ నియామకాలను లేకపోవడం, ఎయిడెడ్‌పై ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పిల్లల సంఖ్య తగ్గిపోయి చాలా బడులు మూతపడ్డాయి. ఇటీవల ఎయిడెడ్ యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కొన్నింటి నియామకాలకు ప్రభుత్వం ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం పోస్టుల హేతుబద్ధీకరణ, తరగతుల విలీనం చేసింది. ఉన్నవారినే సర్దుబాటు చేసి కొత్త నియామకాలను లేకుండా చేసింది. విద్యార్థులతో పాటు అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఆయా బడుల్లో సర్దుబాటు చేసేసింది. పోస్టులను తగ్గించుకునేందుకు 1 నుంచి 9 తరగతుల్లో తెలుగు మాధ్యమం విద్యార్థుల్నీ ఆంగ్ల మాధ్యమంలో సర్దుబాటు చేసింది. 9, 10వ తరగతుల్లో ఒక్కో సెక్షన్‌కు విద్యార్థుల సంఖ్యను 60కు పెంచింది. 6-8 తరగతుల్లో సెక్షన్‌కు 52 మంది విద్యార్థుల చొప్పున అమలు చేసింది. దీంతో ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోయింది.
Vidyonnathi Scheme Stopped by CM Jagan: విద్యోన్నతి పథకానికి తిలోదకాలిచ్చిన జగన్ సర్కారు..బకాయిలు చెల్లించకుండా వేధింపులు
3 నుంచి 10 తరగతులు ఉండే హైస్కూల్‌లో 137 మందికి పైగా విద్యార్థులుంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టులు ఇచ్చింది. ఇలా అనేక చర్యలతో పోస్టులను మిగుల్చుకుంది. కరోనా టైమ్‌లో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలా మంది ప్రభుత్వ బడుల్లో చేరారు. దీంతో తమ వల్లే విద్యార్థుల సంఖ్య పెరిగిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రవేశాలు రివర్స్‌లో ఉన్నా నోరు మొదపడం లేదు.
చివరికి విద్యా హక్కు చట్టాన్ని మార్చేసి: రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదని, గతంలో మూసివేసిన వాటినే తెరిపిస్తున్నామని ఊదరగొట్టిన సీఎం జగన్ ఇప్పుడు సంస్కరణల పేరుతో ఊరిలో బడికి తాళాలు వేసేస్తున్నారు. 3, 4, 5 క్లాసులకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించడంతో 1, 2 తరగతుల్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోయి చాలా స్కూల్స్ మూతపడ్డాయి. స్కూల్స్ దూరం పెంచేందుకు చివరికి విద్యా హక్కు చట్టాన్ని మార్చేశారు. కిలోమీటరు దూరంలో ఉండాల్సిన 3, 4, 5 క్లాసులు మూడు కిలోమీటర్ల దూరం ఉండేలా సవరణ చేశారు.
రాష్ట్రంలో ఏకోపాధ్యాయ స్కూల్స్ లేకుండా చేస్తామని, ప్రతి బడికీ ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని బాకా ఊదిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఏకోపాధ్యాయ బడులు తగ్గకపోగా జగన్ ప్రభుత్వంలో మరింత పెరిగాయి. రాష్ట్రంలో 2020 అక్టోబరు నాటికి సింగిల్ టీచర్ బడులు 7 వేల 774 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 9 వేల 602కు పెరిగింది. హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం 20మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను నియమించాల్సి ఉన్నా ఎస్జీటీల కొరత పేరుతో 30-40 మందికీ ఒక్కరినే నియమించారు.
Education Syllabus Changes in AP: 'ఇదేంటి జగన్ మామా..?' పాఠశాల సిలబస్ మార్పుపై విద్యార్థుల్లో అయోమయం
అంతా గందరగోళం: 1 నుంచి 5 తరగతులున్న పాఠశాలల్లో ఒకటో తరగతి వారికి అక్షరాలు నేర్పించడం, ఐదో తరగతి వారికి పాఠాలు చెప్పడం ఒకే ఉపాధ్యాయుడికి కష్టంగా మారుతోంది. ఒకే రూమ్‌లో అందర్నీ కూర్చోబెట్టడం వల్ల ఎవరికి ఏ పాఠం చెబుతున్నారో తెలియని గందరగోళం ఏర్పడుతోంది. సింగిల్ టీచర్ స్కూల్‌కి వచ్చింది మొదలు ఇంటికి వెళ్లే వరకు బోధన చేస్తూనే ఉండాల్సి వస్తోంది. ఇవి కాకుండా బోధనేతర పనులు మరుగుదొడ్ల ఫొటోలు, విద్యార్థుల ఆన్‌లైన్ హాజరు, పరీక్షల సమయంలో మండల కేంద్రం నుంచి ప్రశ్నపత్రాలు తెచ్చుకోవడం, మధ్యాహ్న భోజనం ఫొటోలు, విద్యాకానుక లెక్కలులాంటి పనులు ఆ టీచరే చేయాలి.
రాష్ట్రంలో మొత్తం ఉపాధ్యాయ పోస్టులు లక్షా 88 వేల 162 కాగా పనిచేస్తున్నవారి సంఖ్య లక్షా 69 వేల 642. దీని ప్రకారం ఖాళీల సంఖ్య 18 వేల 520 కాగా ప్రభుత్వం వాటిని తక్కువ చేసి కేవలం 8 వేల 366 ఖాళీలే ఉన్నాయని చూపుతోంది. ఇలా 10 వేల 154 పోస్టులను వైసీపీ సర్కారు మాయం చేసింది.
Lack of Funds for Govt Schools స్కూళ్లకు విద్యుత్ బిల్లులు కట్టని స్థితిలో ప్రభుత్వం! కనెక్షన్ తొలగింపుతో.. విద్యార్ధుల అవస్థలు!