YCP Govt Neglected Maintenance of Drains and Irrigation Canals:రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి రైతుల పాలిట ప్రకృతి విపత్తులను మించి శాపంగా మారాయి. జగన్ సర్కారు వైఖరి వల్ల ధాన్యాగారంగా ఉండే కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో కాలువలు, డ్రెయిన్లు పూడుకుపోయాయి. ఏటా పంట కాలానికి ముందే సాగు కాలువలు, డ్రెయిన్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేయాల్సి ఉండగా జగన్ సర్కారు ఇందుకోసం వెచ్చించిన నిధులూ అంతంతే. ఆ కాస్త నిధులతోనూ నామమాత్రంగా పనులు చేపట్టి స్వాహా చేసిందే ఎక్కువ. వెరసి తుపాను ధాటికి కాలువలు, డ్రెయిన్లలో ప్రవాహాలు ముందుకు సాగక పంటలు నీటమునిగాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాలువలు, ఆ పంటల్లోని నీటిని బయటకు పంపే డ్రెయిన్ల నిర్వహణ దారణంగా ఉంది. ఫలితంగా 5 లక్షల ఎకరాలకు పైగా పొలాలు జలదిగ్బంధమయ్యాయి.
రైతులను పరామర్శించాలంటే పొలాల్లోకే వెళ్లాలా ఏంటీ? - వేదిక పైనుంచి జగన్ ముసిముసి నవ్వులతో పలకరింపులు
Combined Guntur District:ఉమ్మడి గుంటూరు జిల్లాలో అస్తవ్యస్త డ్రెయిన్లు రెండు లక్షల ఎకరాలకుపైగా పంటలను నీటముంచాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోనూ అప్పాపురం, కొమ్మమూరు కాలువ దుస్థితితో అన్నదాతలకు నష్టం జరిగింది. బాపట్ల జిల్లాలో కారంచేడు-స్వర్ణ మధ్య కొమ్ములూరు కాలువ తెగిపోయింది. నిర్వహణకు నిధులులేక బలహీనంగా మారిన కాల్వ కట్ట తెగిపోవడంతో పంటలు నీటమునిగాయి. చినగంజాం మండలంలో గొనసపూడి డ్రెయినేజి కాలువకు గండిపడింది. ఇందులో తుమ్మ చెట్లు అడ్డుగా నిలిచిపోవడంతో నీరంతా పొలాలను ముంచెత్తింది. భట్టిప్రోలు ప్రధాన డ్రెయిన్ నిర్వహణ అంతంతమాత్రంగా ఉంది. రేపల్లె మెయిన్ డ్రెయిన్‌కు కోత పడి పొలాల్లోకి నీరు చేరాయి. రొంపేరు డ్రెయిన్‌లో జమ్ము, తూటికాడ పెరిగిపోవడంతో ప్రవాహాలు పొలాలను ముంచెత్తాయి.
Joint Krishna District:ఉమ్మడి కృష్ణా జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాల ప్రకారమే 2 లక్షల 33 వేల ఎకరాలు ముంపులో చిక్కాయి. గూడూరు మండలంలో 17 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వడ్లమన్నాడు డ్రెయిన్ గట్లకు సమాంతరంగా ప్రవహించింది. ముక్కొల్లులోని వంతెన వద్ద గూడు అల్లుకుపోయి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. మచిలీపట్నం సమీపంలోని శివగంగ మేజర్ డ్రెయిన్, లంకపల్లి కాలువ, మల్లవోలు, కుక్కలకోడు ఇలా మచిలీపట్నం నియోజకవర్గంలో అన్ని మురుగుకాల్వలు అధ్వానంగా ఉన్నాయి. పెడన, గూడురు మండలాల్లో 24.7 కిలోమీటర్ల మేర ఉన్న లజ్జబండ కాలువ ఇసుక మేటలు వేసేసింది.
తీరని నష్టాన్ని మిగిల్చిన మిగ్‌జాం తుపాను - ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న లంక రైతులు