విద్యార్థుల పాలిట గుదిబండలా "ఆడుదాం ఆంధ్రా"- జగన్ సర్కార్ బలవంతపు ఎన్నికల ఆటకు పిల్లలు బలి YCP Government Troubling Students for Adudam Andhra:రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు ప్రభుత్వం క్రీడా పోటీలు నిర్వహించబోతోంది. ఈ పోటీల్లో 15 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా ఆడాలంటూ గ్రామ, వార్డు వాలంటీర్లు బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ క్రీడలు ఫిబ్రవరి వరకు జరగనుండగా పది, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చిలో ప్రారంభమవుతాయి. వీటికి విద్యార్థులు సన్నద్ధం కావాలి. పదో తరగతి సిలబస్ జనవరితో పూర్తవుతుంది. ఈ సమయంలో ప్రతి క్లాస్ విలువైనదే. విద్యార్థి దశలో పది, ఇంటర్ ఎంతో కీలకం. ఇంత విలువైన సమయంలో బడిలో లేకుండా క్రీడలకు తీసుకువెళ్తే విద్యార్థుల భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎన్నికల ముందు ప్రచారం కోసం విద్యార్థుల జీవితాలను పణంగా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు.
జగనన్న బలవంతపు ఆట- ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనాలని హుకుం
పరీక్షలు దగ్గర పడుతున్నాయని చెబుతున్నా:‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో పోటీలు నిర్వహిస్తున్నారు. పురుషులు, మహిళలు రెండు విభాగాల్లో ఈ పోటీలకు 15 ఏళ్లు పైబడిన వారి పేర్లను వాలంటీర్లు సచివాలయంలో పరిధిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. చాలా సచివాలయాల పరిధిలో ఆడేందుకు క్రీడాకారులు లభించడం లేదు. మహిళల క్రికెట్, వాలీబాల్‌కు ఆడేవారు దొరక్క కళాశాలలు, బడికి వెళ్తున్న వారి పేర్లు రాసేస్తున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి తాము చదువుకోవాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఆటలు ఆడించేందుకు అంఫైర్లు లేకపోవడంతో పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులను తీసుకుంటున్నారు. క్రీడాకారులను తీసుకురావాలని కొన్నిచోట్ల పీఈటీలను ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో అన్ని రకాల ఆటలు ఆడించేందుకు 20 మంది వరకు అంఫైర్లు అవసరమవుతారు. ఇంతమంది దొరకని పరిస్థితి.
'ఆడుదాం ఆంధ్రా' క్రీడల్లో రాణించిన వారికి నగదు బహుమతులు
క్రీడాకారులు లేకపోవడంతో విద్యార్థులపై కన్ను:సచివాలయం పరిధిలో అన్ని క్రీడలకు కనీసం రెండేసి జట్లు కావాలంటే 228 మంది క్రీడాకారులు అవసరం. ఈ సంఖ్య దొరకడం లేదు. పోటీలు నిర్వహించాలంటే ఒక్కో క్రీడలోనూ కనీసం మూడు జట్లైనా ఉండాలి. క్రికెట్‌కు మూడు జట్లకు మహిళలు దొరకడం లేదు. మహిళల వాలీబాల్ క్రీడలోనూ ఇదే దుస్థితి. క్రీడాకారులు లేకపోవడంతో ఇప్పుడు అంతా విద్యార్థులపై పడ్డారు. స్థానికంగా ఉండేది వారే కావడంతో వారి పేర్లను నమోదు చేసేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి క్రీడలు అండర్-14, 17, 19 కొనసాగుతున్నాయి. ఇవి డిసెంబరుతో ముగియనున్నాయి. ఇప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా’ ఆటలు మొదలైతే వీరిలో చాలా మంది మళ్లీ ఆడాలి. కీలకమైన దశలో సమయం మొత్తం ఆటలకే పోతే పరీక్షల సన్నద్ధతపై ప్రభావం పడుతుంది. విద్యార్థులు సన్నద్ధం కావాల్సిన కీలక సమయాన్ని జగన్ ఆయన ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
TDP Leaders Fire on CM Jagan: కక్ష సాధింపులో జగన్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్: లోకేశ్
ఒక పక్క పాఠాలు మరోపక్క మైదానంలో ఆటల:సచివాలయం పరిధిలో ఆటలు ఆడించేందుకు క్రీడా స్థలాలు లేవు. చాలాచోట్ల అద్దెకు తీసుకునేందుకు అవకాశం లేకుండాపోయింది. 50 రోజుల్లోనే హడావుడిగా దాదాపు 3 లక్షల మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటలకు కొద్దిపాటి స్థలం ఉన్నా ఆడించొచ్చు. క్రికెట్‌కు ఎక్కువ స్థలం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల 951 సచివాలయాల్లో ఆట స్థలాలను ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే ఉన్నాయి. ఇలాంటి చోట ఒక పక్క విద్యార్థులకు పాఠాలు చెబుతుంటే మరోపక్క మైదానంలో ఆటలతో గందరగోళం ఉంటుంది. ఆటలు చూసేందుకు రావాలంటూ జనాలపై వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారు. చూసేందుకు రాకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.