ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేద‌రిక‌మ‌నే జ‌బ్బుకు ప్రభుత్వం చికిత్స చేస్తోంది' - ycp mla vidadala rajini latest news

రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల ర‌జిని తెలిపారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా త‌మ ప్రభుత్వం పథకాలను ప్ర‌వేశ‌పెడుతోందని చెప్పారు.

ycp mla vidadala rajini
ycp mla vidadala rajini

By

Published : Nov 8, 2020, 5:45 PM IST

పేద‌రిక‌మ‌నే జ‌బ్బుకు తమ ప్రభుత్వం చికిత్స చేసే ప‌నిలో ఉందని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల ర‌జిని తెలిపారు. 'ప్ర‌జ‌ల‌లో నాడు.. ప్ర‌జ‌ల కోసం నేడు' కార్య‌క్ర‌మంలో భాగంగా మూడో రోజైన ఆదివారం మండల కేంద్రమైన య‌డ్ల‌పాడు నుంచి మైద‌వోలు మీదుగా లింగారావుపాలెం వ‌ర‌కు ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టారు.

లింగారావుపాలెం గ్రామంలో ప్రజలతో ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా త‌మ ప్రభుత్వం పథకాలను ప్ర‌వేశ‌పెడుతోందని తెలిపారు. వైకాపా అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌లంతా క్షేమంగా ఉన్నార‌ని చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details