ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మైనారిటీల సంక్షేమాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కింది'

మైనార్టీల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెదేపా నేతలు జీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను పక్కన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

pattipati pullarao
pattipati pullarao

By

Published : Nov 1, 2020, 7:14 PM IST

మైనారిటీల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెదేపా నేతలు నరసరావుపేట పార్లమెంటరీ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఆదివారం గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా కార్యాలయంలో మైనారిటీలతో వారు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెదేపా హయాంలో ముస్లింలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తే... వాటిని వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టిందని జీవీ ఆంజనేయులు చెప్పారు. ముస్లింల అభివృద్ధిని అటకెక్కించిందని అన్నారు. అదే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్​కు తేదేపా హయాంలో 245 కోట్ల రూపాయల నిధులిస్తే... ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ఇప్పటి వరకూ కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. వైకాపా ప్రభుత్వ విధానాలు రాష్ట్రంలోని పేద ప్రజలకు బాధాకరంగా మారాయని దుయ్యబట్టారు.

తెదేపా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ....వైకాపా ప్రభుత్వం పేద బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. మైనారిటీలకు రాష్ట్ర సర్కార్ అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మరోవైపు పోలవరం నిధులను కేంద్రం కుదించినా ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. మొక్కుబడిగా కేంద్రానికి లేఖ రాయడం మాని... నిధుల కోసం దిల్లీ వెళ్లి పోరాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరసరావుపేట తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మైనారిటీ సభ్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details