గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం జరుగులవారిపాలెంలో వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తెదేపా జెండా ఉన్న ఆటోపై దాడి చేశారు. వైకాపా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో తెదేపా జెండా కట్టుకుని వస్తున్న ఆటోపై దాడి చేశారు. జెండాను చింపి, కాళ్లతో తొక్కారు. పోలీసులు ఉన్నా వారిని నియంత్రించలేదు. చివరికి ఆటోడ్రైవర్ తప్పించుకుని ఆటోతో సహా అక్కడినుంచి అతి కష్టం మీద వెళ్లిపోయాడు.
తెదేపా జెండా ఉన్న ఆటోపై వైకాపా కార్యకర్తల దాడి - గుంటూరు జిల్లా
వైకాపా కార్యకర్తలు హద్దుమీరారు. తెదేపా జెండా పెట్టుకుని ఉన్న ఆటోపై దాడికి దిగారు. జెండాను చించి ఆటోడ్రైవర్‌ను హడలగొట్టారు. పోలీసులు ఉన్నా వారిని నియంత్రించలేకపోయారు.
హద్దుమీరిన వైకాపా కార్యకర్తలు