ప్యాకేజీల పేరుతో అమరావతి రైతులను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. రాజధానే లేకపోతే ప్యాకేజీలు ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. రాజధానిగా అమరావతి కావాలా వద్దా అనే అంశంపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్‌తో పాటు అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై వైకాపా అసత్య ఆరోపణలు చేస్తోందని లోకేశ్ అన్నారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఒక్క కేసు అయినా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
ఆ జిల్లాల వైకాపా నేతలు రాజీనామా చేయాలి: లోకేశ్ - అమరావతి రైతుల ఆందోళనట
అమరావతి ప్రజలకు జరిగిన ద్రోహమే.. రేపు విశాఖ వాసులకు జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అమరావతి కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి... ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
పరిశ్రమల్ని పంపేస్తే ఇక అభివృద్ధి వికేంద్రీకరణకు ఆస్కారం ఏదని ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరావతి ప్రజలకు జరిగిన ద్రోహమే రేపు విశాఖ వాసులకు జరుగుతుందని అన్నారు. మరో 6నెలల తర్వాత రాజధాని పులివెందులలో అన్నా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'వైకాపా నేతలూ.. ప్రజలు కావాలో జగన్ కావాలో తేల్చుకోండి'