ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉందనుకోవడం లేదు.. ఓటమిపై విశ్లేషిస్తాం: సజ్జల - undefined

MLC elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలు ఎవరనేది గుర్తించినట్లు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి వెల్లడించారు. తమకు అభ్యర్థులను గెలిపించుకునే సంఖ్యా బలం ఉంది కాబట్టే 7 సీట్లకు పోటీపడినట్లు సజ్జల వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభ పెట్టారని సజ్జల ఆరోపించారు. ఎక్కడ లోపం ఉందో విశ్లేషించి చర్యలు తీసుకుంటామని సజ్జల పేర్కొన్నారు.

ycp flag
ycp flag

By

Published : Mar 23, 2023, 8:28 PM IST

Updated : Mar 24, 2023, 6:31 AM IST

MLC elections results: గత వారం రోజులుగా ఉత్కంఠ రేపుతూ వచ్చిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మెుత్తం ఏడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అనుకున్నట్లుగా ఏడు సీట్లు గెలుచుకోలేకపోయింది. టీడీపీ ముందు నుంచి చెబుతున్నట్లుగా ఆ ఓక్క సీటు కైవసం చేసుకోని అధికార పార్టీలో కలవరాన్ని పెంచింది.

గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు:వైసీపీ అభ్యర్థులు సూర్యనారాయణ రాజు, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయేలు, చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్ జయమంగళ విజయం సాదించారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చిన తరువాత విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, వైసీపీ అభ్యర్థన మేరకు అధికారులు ఓట్లను మళ్లీ లెక్కించారు. రెండో సారి లెక్కింపులో సైతం పంచమర్తి అనురాధ విజయం సాదించడంతో 6 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ, 1 స్థానంలో టీడీపీ విజయం సాధించి నట్లయింది.

సజ్జల రామకృష్ణ రెడ్డి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలు ఎవరనేది గుర్తించినట్లు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలపై తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబే ప్రలోభ పెట్టారని సజ్జల ఆరోపించారు. తిరుగుబాటు బావుట ఎగరవేసిన ఇద్దరు వైసీపీ సభ్యులను పరిగణనలోకి తీసుకోలేదని సజ్జల రామకృష్ణ తెలిపారు. తమకు అభ్యర్థులను గెలిపించుకునే సంఖ్యా బలం ఉంది కాబట్టే 7 సీట్లకు పోటీపడినట్లు సజ్జల వెల్లడించారు. తమ తరుపునుంచి ఎక్కడ లోపం ఉందో విశ్లేషించి చర్యలు తీసుకుంటామని సజ్జల పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉందని అనుకోవట్లేదని సజ్జల తెలిపారు. ఎవరైనా అసంతృప్తిగా భావిస్తే వారిని పిలిచి ఆయా సమస్యలపై మాట్లాడతామన్నారు. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవడానికి ఇదేమి ఉద్యోగం కాదని సజ్జల హితవు పలికారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సజ్జల కామెంట్స్

మాజీ మంత్రి, కన్నబాబు:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు సమీక్ష చేసుకుంటామని... మాజీ మంత్రి, వైకాపా నేత కన్నబాబు అన్నారు. బాధ్యులు ఎవ్వరైనా సరే పార్టీ నుంచి చర్యలు తప్పవని అన్నారు. తమ పార్టీకి ఉన్న సంఖ్యా బలం ప్రకారం 6 సీట్లు గెలుచుకున్నామని పేర్కొన్నారు. టీడీపీ ఎన్నికల్లో 23 సీట్లను గెలుచుకుందని వెల్లడించిన ఆయన.. కొందరు వైసీపీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతి పక్షపార్టీకి ఓట్లు వేశారని పేర్కొన్నారు. ఓట్లు వేసింది ఎవరనేది తెలిస్తే వారిపై చర్యలు తీసుకోకుండా ఉంటామా అని కన్నబాబు ప్రశ్నించారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై చర్యలు తీసుకునే విషయంపై జగన్ నిర్ణయం తీసుకుంటారని కన్నబాబు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 24, 2023, 6:31 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details