ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణేష్ నిమజ్జనం చూస్తే... దాడులా? - undefined

వినాయకుని నిమజ్జనం చూస్తున్న ఓ వ్యక్తిపై... వైకాపా నాయకులు దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా కొమెరపూడిలో చోటుచేసుకుంది. నిందితులను శిక్షించాలని బాధితుడి బంధువులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

గణేష్ నిమజ్జనం చూస్తే... దాడులు చేస్తారా అంటూ బాధితుడి బంధువుల ఆందోళన

By

Published : Sep 6, 2019, 10:22 PM IST

గణేష్ నిమజ్జనం చూస్తే... దాడులు చేస్తారా అంటూ బాధితుడి బంధువుల ఆందోళన

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో... తెలుగుదేశం పార్టీకి చెందిన మార్చల సాగర్​పై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో వినాయకుని నిమజ్జనం గురువారం అర్ధరాత్రి జరిగింది. పనికి వెళ్లి అప్పుడే వచ్చిన మార్చల సాగర్... ట్రాక్టర్​ ఎక్కి వేడుకను చూస్తుండగా... వైకాపా నాయకులు సాగర్​పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడినే పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారని... నిందితులను ఏమి అనలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెదేపా మద్దతు దారులమనే ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డారని...బాధ్యులను కఠినంగా శిక్షించాలని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details