YCP LEADERS OVER ACTION : గుంటూరు జిల్లా తుళ్లూరులోని రైతుల దీక్షా శిబిరం వద్ద వైకాపా నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా తుళ్లూరులో ఆయన విగ్రహానికి పూలమాల వేసేందుకు శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ వస్తున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు దీక్షా శిబిరం వద్ద ద్విచక్ర వాహనాలతో హడావుడి చేస్తూనే.. మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ద్విచక్ర వాహనదారులను అక్కడినుంచి పంపించేశారు. దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. వైకాపా నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం తగదని హెచ్చరించారు.
తుళ్లూరులో వైకాపా నాయకుల అత్యుత్సాహం.. రైతుల దీక్షా శిబిరం వద్ద రెచ్చగొట్టే వ్యాఖ్యలు
YCP ACTIVISTS OVER ACTION : తుళ్లూరులోని రైతుల దీక్షా శిబిరం వద్ద వైకాపా శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓవైపు ద్విచక్ర వాహనాలతో హడావుడి చేస్తూనే.. మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై అక్కడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YCP ACTIVISTS OVER ACTION