గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడులో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో తెలుగుదేశం కార్యకర్తపై... వైకాపా కార్యకర్తల దాడి చేశారు. తెలుగుదేశం నేతల వెంట తిరుగుతున్నాడన్న కోపంతో పెద వెంకయ్య అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డారు. కుమారుడి కోసం వచ్చిన వైకాపా కార్యకర్తలు.. అతను లేకపోవటంతో తండ్రిని కొట్టారు. బాధితుడు గాయాలతోనే తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చి చంద్రబాబు ఎదుట తన గోడును వెళ్లబోసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తనపై దాడి జరిగిన తీరును చంద్రబాబుకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. డీజీపీ, ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.
తెదేపా కార్యకర్తపై.. వైకాపా శ్రేణుల దాడి - తెదేపా కార్యకర్తపై దాడి చేసిన వైకాపా కార్యకర్తలు
గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడులో తెదేపా కార్యకర్తపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. తెదేపా నేతల వెంట తిరుగుతున్నాడన్న కోపంతో దండు పెద వెంకయ్య అనే వ్యక్తిని గాయపరిచారు. బాధితుడు గాయాలతో తెదేపా కేంద్ర కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన చంద్రబాబు అధైర్యపడవద్దని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ycp activists attacking tdp activist in guntur macharla
TAGGED:
ycp-tdp godava