ATTACK: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతలలో అర్థరాత్రి మట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీసులపై వైకాపా నాయకలు దౌర్జన్యానికి దిగారు. చెరువులో మట్టి తవ్వుకునేందుకు నీటిపారుదలశాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. ఇదే అదనుగా వైకాపా నాయకులు రాత్రి, పగలు తేడా లేకుండా పెద్దఎత్తున మట్టి తరలించారు. దీంతో అధికారులు మట్టి తవ్వకాలను నిలిపివేసినా.. వైకాపా నాయకులు ఆగలేదు. దీంతో స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు మట్టి తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లి అడ్డుకోవడంతో మూకుమ్మడిగా ఆయనపై వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇక్కడే ఉంటే వీరు చంపేస్తారేమోనంటూ ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోదామని కానిస్టేబుళ్లతో అన్నాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఎస్సైను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపడం గమనార్హం. ఇక్కడ మట్టి తవ్వకాలన్నీ స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందని స్థానికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ATTACK: చెరువులో మట్టి అక్రమ తరలింపు... అడ్డుకున్న ఎస్సైపై దాడి..! - అక్రమంగా చెరువులో మట్టి తరలిస్తున్న వైకాపా నేతలు
ATTACK: మట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీసులపై వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారు. చెరువులో మట్టి తవ్వుకునేందుకు నీటిపారుదలశాఖ అధికారులు అనుమతి ఇవ్వగా.. ఇదే అదనుగా వైకాపా నాయకులు రాత్రి, పగలు తేడా లేకుండా పెద్దఎత్తున మట్టి తరలించారు. దీంతో అధికారులు మట్టి తవ్వకాలను నిలిపివేసినా.. వైకాపా నాయకులు ఆగలేదు.
అక్రమంగా చెరువులో మట్టి తరలిస్తున్న వైకాపా నేతలు