గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోలు పోస్టు చేయటం సంచలనం కలిగించింది. సంబంధిత వాట్సాప్ గ్రూపు అడ్మిన్ ఫిర్యాదుతో పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. కారకుడిని గుడారయ్యా(26)గా పోలీసులు గుర్తించారు. వైకాపా కార్యకర్త అయిన ఇతను.. ఉపాధి హామీ పనుల ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అశ్లీల వీడియోలను స్థానిక పార్టీ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. సంబంధిత వీడియోలు ఓ యువతికి చెందినవిగా ప్రచారం జరగటంతో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
వీడియోల వ్యవహారం పోలీసుల దృష్టికి చేరింది. వీడియోలు పోస్టయిన వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అడ్మిన్ ఇచ్చిన ఫిర్యాదుతో గుడారయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియోలలో ఉన్నది ఎవరో తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. నిందితుడు గుడారయ్య ఉపాధి హామీ పనుల ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తూనే... పాఠశాల విద్యార్థినులకు ఇంటి వద్ద ట్యూషన్ చెబుతూ ఉంటాడు. అతను విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడని ఆరోపణలు ఉన్నాయి. వైరల్ అయిన వీడియోలు సదరు వ్యక్తే చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం అవుతోంది.