ప్రజల అభీష్టం మేరకు గుంటూరు జిల్లా గురజాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పాటుపై దాచేపల్లిలో జేఏసీ సమావేశం నిర్వహించారు. 800 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పల్నాడు ప్రాంతంలోని గురజాలకు జిల్లా కేంద్రం చేయటానికి అన్ని అర్హతలు ఉన్నాయని యరపతినేని స్పష్టం చేశారు. పల్నాటి గడ్డపై పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామన్న ఆయన...గత 70 ఏళ్లుగా పల్నాటి ప్రజలను రాజకీయ నాయకులు పావులుగా వాడుకుంటున్నారన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకుల ఆధిపత్య పాలనను, ఆధిక్యతను ఇకనుంచి చెల్లనివ్వబోమని తెలిపారు.
గురజాలను నూతన జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: యరపతినేని
గుంటూరు జిల్లా గురజాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 70 ఏళ్లుగా పల్నాటి ప్రజలను రాజకీయ నాయకులు పావులుగా వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
గురజాలను నూతన జిల్లా కేంద్రంగా ప్రకటించాలి