ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపితే సర్కార్‌కు ఉలుకెందుకు..? - తెదేపా నేత యనమల తాజా వార్తలు

వైకాపా ప్రభుత్వం అధికారులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని తెదేపా నేత యనమల సూచించారు. బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపితే ప్రభుత్వానికి అంత ఉలుకెందుకని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి భయపడుతున్నారా అంటూ ప్రశ్నించారు.

YANAMALA_RAMAKRISHNUDU
బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపితే సర్కార్‌కు ఉలుకెందుకు....?

By

Published : Feb 10, 2020, 12:56 PM IST

Updated : Feb 10, 2020, 1:54 PM IST

బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపితే సర్కార్‌కు ఉలుకెందుకు..?

వైకాపా ప్రభుత్వం తెదేపాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అధికారులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని సూచించారు. గత కౌన్సిల్‌లో జరిగిన ఘటనలు అందరికీ తెలిసినవేనన్న యనమల... అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లులను కౌన్సిల్‌ పరిశీలించే అవకాశం ఉందన్నారు.

రాజ్యసభకు ఉన్నట్లే రాష్ట్రాల్లో మండలికి కూడా అధికారాలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లులపై మాట్లాడటం తప్పా అంటూ ప్రశ్నించారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తే ప్రభుత్వానికి భయమెందుకు? అన్నారు. తాము బిల్లులను అడ్డుకోలేదని సెలెక్ట్‌ కమిటీకి మాత్రమే పంపామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుని క్రోడీకరించడం తప్పా? అని నిలదీశారు. మండలి ఛైర్మన్‌ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా తప్పుబడతారా? అని మండిపడ్డారు. మండలి ఛైర్మన్‌పై ప్రివిలైజ్‌ నోటీసు ఇస్తారని తెలిసిందన్న యనమల... ఆ అధికారం ఉంటుందా? అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:రాష్ట్ర ప్రజలపై భారం.. విద్యుత్ ఛార్జీలు పెంపు

Last Updated : Feb 10, 2020, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details