ప్రభుత్వ ఖర్చుతో వైఎస్సార్ జయంతి నిర్వహించడాన్ని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. రైతు దినోత్సవం అని పేరు పెట్టి... తెదేపా ఎమ్మెల్యేలను అవమానించారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలపై దాడి గురించి హక్కుల నోటీసులు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్ చిత్రపటం ఉండటంపై ఆక్షేపణ వ్యక్తం చేశారు.
నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు మాత్రమే ఉండాలని గుర్తుచేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల్లో ఏం చేసిందో చెప్పకుండా... గత ప్రభుత్వంపై బురద జల్లటమే ధ్వేయంగా పనిచేస్తోందని దుయ్యబట్టారు.