ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూల్ 154 ప్రకారం మండలి ఛైర్మన్ నిర్ణయం: యనమల - రాజధాని బిల్లుపై యనమల వ్యాఖ్యలు

రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్​ కమిటీకి సిఫారసు చేస్తూ శాసన మండలి నిర్ణయం తీసుకుంది. దీనిపై యనమల రామకృష్డుడు స్పందించారు. ప్రభుత్వ పాలసీని వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటీసుపై జరిగిన ఓటింగ్​లో తాము గెలిచామన్నారు.

రూల్ 154 ప్రకారం మండలి ఛైర్మన్ నిర్ణయం: యనమల
రూల్ 154 ప్రకారం మండలి ఛైర్మన్ నిర్ణయం: యనమల

By

Published : Jan 22, 2020, 11:21 PM IST

శాసన మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కొన్ని పొరపాట్లు జరిగినా.. ఛైర్మన్‌ నిర్ణయమే అంతిమం అని చెప్పారు. శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి సిఫార్సు చేస్తూ ఛైర్మన్‌ షరీఫ్‌ తీసుకున్న నిర్ణయంపై యనమల హర్షం వ్యక్తం చేశారు.

మండలి వాయిదా వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసనసభలోనూ బిల్లులు ప్రవేశపెట్టే విషయంలో ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. శాసనసభలో స్పీకర్‌కు నిబంధనలు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే బిల్లులను ఆమోదించుకుని ఎలా వెళ్తారని ఆయన మండిపడ్డారు. బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళ్తే ప్రభుత్వానికున్న ఇబ్బందేమిటిని దుయ్యబట్టారు. నిబంధన 154 ప్రకారం మండలి ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని తాము వ్యతిరేకించామని చెప్పారు. ఛైర్మన్ షరీఫ్‌పై వైకాపా సభ్యుల దాడి చేసేందుకు యత్నించారని.. దీన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నారా లోకేశ్‌పై మంత్రి అనిల్‌ దాడి చేసే ప్రయత్నం చేశారని యనమల ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details